Global Vaartha
Date of Publish : 07/11/2026, 10:42 am
Editor : భవ్య జర్నలిస్ట్

బ్యాలెట్ బాక్సులో గ్రామ సమస్యల స్లిప్పులు.. పల్నాడులో ఆసక్తికర సన్నివేశం

పల్నాడు జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో మొత్తం 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 5న పోలింగ్‌ జరుగగా.. ఈరోజు ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని జిల్లాల్లో ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక పల్నాడు జిల్లాలోనూ కౌంటింగ్ షురూ అయ్యింది. ఈ క్రమంలో జిల్లాలోని సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.కంకణాలపల్లి గ్రామస్థులు తమ ఊరి సమస్యలను పేపర్‌పై రాసి బ్యాలెట్‌ బాక్స్‌లో వేయడం చర్చనీయాంశంగా మారింది. తమ గ్రామానికి రైల్వే అండర్ పాస్ కాకుండా ఫ్లైఓవర్ వేయాలని కంకణాలపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. ఓటింగ్ సమయంలో ఊరి రైల్వే బ్రిడ్జ్ సమస్యలను ఓటర్ స్లిప్‌లపై రాసి బ్యాలెట్ బాక్స్‌లో గ్రామ ప్రజలు వేశారు. ఈరోజు ఉదయం కౌంటింగ్ సందర్భంగా గ్రామస్థులు వేసిన స్లిప్‌లు బయటపడ్డాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save