Global Vaartha
Date of Publish : 07/11/2026, 10:56 am
Editor : భవ్య జర్నలిస్ట్

దీపావళి పండుగ ఎఫెక్ట్‌.. సొంతూళ్లకు 2 లక్షల మంది పయనం

  • కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
  • విమాన చార్జీలకు రెక్కలు

చెన్నై: దీపావళి పండుగను సొంతూర్లలో జరుపుకునేందుకు నగర వాసులు తరలివెళ్ళారు. గురువారం ఒక్కరోజే ఏకంగా రెండు లక్షల మంది ఊర్లకు వెళ్ళారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, రైళ్ళు, విమానాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దీపావళి రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు విమానయాన సంస్థలు చార్జీలను ఏకంగా నాలుగు రెట్లు పెంచేశాయి.

దీపావళి పండుగకు సొంతూర్లకు వెళ్ళే వారి కోసం రాష్ట్ర రవాణా సంస్థ రెగ్యులర్‌ సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. చెన్నై నగరం నుంచి వివిధ జిల్లాలకు సాధారణ రోజుల్లో నడిపే 2191రెగ్యులర్‌ బస్సులతో పాటు 2870 ప్రత్యేక బస్సులను నడిపేలా ప్లాన్‌ చేశారు. గురువారం రెగ్యులర్‌ సర్వీసులతో పాటు 1018 ప్రత్యేక బస్సులు కలిపి మొత్తం 3209 బస్సులను నడిపారు. ఈ బస్సుల్లో గురువారం ఒక్కరోజే ఏకంగా 1.40 లక్షల మంది ప్రయాణించారు.

ఇదిలావుండగా విమాన ప్రయాణ చార్జీలను నాలుగు రెట్లు అధికంగా వసూలు చేశారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమన్నారు. మరోవైపు, ప్రయాణికులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా రవాణా శాఖామంత్రి విజయ్‌ తమిళన్‌ పార్తిబన్‌ కీలాంబాక్కం బస్టాండు నుంచి స్వయంగా పర్యవేక్షించారు. అలాగే, మరైమలర్‌ నగర్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. ముఖ్యంగా రవాణా సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల సమీపానికి బస్సులు వెళ్ళేలా తొమ్మిది సర్వీసులను నడిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save