Global Vaartha
Date of Publish : 07/11/2026, 10:58 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఆసీస్ ప్లేయర్లందరికీ తెలుసు.. శాండ్‌పేపర్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన 2018 శాండ్‌పేపర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారంలో ముగ్గురు ఆటగాళ్లే బాధ్యులుగా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బంతి ఆకారాన్ని మార్చేందుకు శాండ్‌పేపర్ ఉపయోగించిన విషయం జట్టులోని అందరికీ తెలుసని, ఈ వ్యవహారంలో మొత్తం టీమ్ భాగస్వామ్యమైందని ఆరోపించాడు. కెమెరాకు చిక్కిన కేప్‌టౌన్ టెస్టుకు ముందే పోర్ట్ ఎలిజబెత్ టెస్టులోనూ బాల్ ట్యాంపరింగ్ జరిగిందని వెల్లడించాడు.ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన 2018 శాండ్‌పేపర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారంలో ముగ్గురు ఆటగాళ్లే బాధ్యులుగా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బంతి ఆకారాన్ని మార్చేందుకు శాండ్‌పేపర్ ఉపయోగించిన విషయం జట్టులోని అందరికీ తెలుసని, ఈ వ్యవహారంలో మొత్తం టీమ్ భాగస్వామ్యమైందని ఆరోపించాడు. కెమెరాకు చిక్కిన కేప్‌టౌన్ టెస్టుకు ముందే పోర్ట్ ఎలిజబెత్ టెస్టులోనూ బాల్ ట్యాంపరింగ్ జరిగిందని వెల్లడించాడు.

అసలేం జరిగిందంటే?

2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా న్యూలాండ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరాకు చిక్కాడు. రివర్స్ స్వింగ్ కోసం బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా జరిపిన విచారణలో అప్పటి వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ ప్లాన్ వేయగా.. బాన్‌క్రాఫ్ట్ దాన్ని అమలు చేసినట్లు తేల్చారు. అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విషయం తెలిసినా అడ్డుకోలేదని నిర్ధారించారు. దీంతో ముగ్గురినీ స్వదేశానికి పంపించారు. స్మిత్, వార్నర్‌పై 12 నెలలు.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save