అమరావతి : సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేశ్.. రాప్తాడు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. బాలిక ఆరోగ్యం మెరుగవుతోందని.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.‘రాప్తాడు విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. చిన్నారి బాగుంది. స్పృహలో ఉంది. ఈ రోజు హాయిగా కుర్చీలో కూర్చొంది. డాక్టర్లు ఆమెకు ఘన ఆహారపదార్థాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ రోజు ఆమె కొన్ని అడుగులు కూడా వేసింది. మరికొన్ని అడుగులు వేసేలా ఆమెను ఉత్సాహపరుస్తారని ఆశిస్తున్నా. బాలిక క్షేమం కోసం ప్రార్థనలు చేసిన అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.