Global Vaartha
Date of Publish : 07/11/2026, 11:34 am
Editor : భవ్య జర్నలిస్ట్

యూపీలో విషాదం.. ట్రాలీని ట్రక్కు ఢీకొని ఐదుగురు మహిళల మృతి

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వస్తున్నట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు మహిళలు చనిపోయారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఓ ట్రాక్టర్ ట్రాలీలో సీతాపూర్ జిల్లాలోని హర్దోయ్‌కు వెళ్లారు. అక్కడ పుట్టెంట్రుకలు తీసే కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తుండగా.. హిమ్మత్ నగర్‌లో వారి వాహనాన్ని ఒక ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం తీవ్రతకు ట్రాక్టర్ ట్రాలీ తలకిందులైందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడిచారు. బాధితులకు సరైన వైద్యం అందేలా చూడాలని పోలీసు అధికారులను జిల్లా కలెక్టర్ రాజా గణపతి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకుర్ అగర్వాల్ ఆదేశించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save