కాకినాడ, : జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాకినాడ కౌంటింగ్ కేంద్రంలో అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కాకినాడ కౌంటింగ్ కేంద్రంలో వివాదం తలెత్తింది. కౌంటింగ్ కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ.. ఎన్నికల సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు.. ఆర్డీవో అధికారి మల్లిబాబుపై గొడవకు దిగారు. దీంతో ఆర్డీవో మల్లిబాబు.. కౌంటింగ్ కేంద్రంలో సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారంటూ.. జెడ్పీ సీఈవో ను నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు అధికారులు అందరి ముందు గొడవకు దిగడంతో పోలీసులు వారించి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.