ఇంటర్నెట్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. భారత్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలవడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.ఓ వైపు వికెట్లు పడుతున్నా డారిల్ మిచెల్(55) పోరాడి హాఫ్ సెంచరీ చేశాడు. అతడి నాక్ వల్లే కివీస్ ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. మిచెల్ శాంట్నర్(31), నికోల్స్(11) పరుగులు చేశారు. ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. విల్ యంగ్(6), టిమ్ సీఫర్ట్(0), లాథమ్(7), ఫిలిప్స్(0), స్మిత్(3), జెమీసన్(7), టిక్నర్(2) పరుగులు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 4, అన్షుల్ కాంబోజ్ 2, అక్షర్ పటేల్ 2, ఆకిబ్ నబీ 2 రెండు వికెట్లు పడగొట్టారు.