Global Vaartha
Date of Publish : 07/11/2026, 12:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీ పరిషత్ ఎన్నికల్లో కూటమి ఆధిక్యం.. జడ్పీటీసీలో 206, ఎంపీటీసీలో 2,888 స్థానాల్లో లీడ్

అమరావతి : ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంలో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఏకగ్రీవాల్లో కూటమే ఆధిక్యంలో నిలవగా.. తాజాగా ఎన్నికల కౌంటింగ్‍లోనూ కూటమి పార్టీల జోరు కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కూటమి పార్టీల అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తున్నారు. పరిషత్‌ ఎన్నికల్లో కూటమికి వైసీపీ పోటీ ఇవ్వలేని పరిస్థితి. జడ్పీటీసీ ఎన్నికలలో కూటమి 206 స్థానాల్లో ఆధిక్యంలో నిలవగా.. వైసీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో కూటమి అభ్యర్థులు 2888 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక వైసీపీ 102 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. మెజార్టీ జడ్పీలు, ఎంపీపీలు గెల్చుకునే దిశగా కూటమి దూసుకెళ్తోంది.ఈనెల 5న జరిగిన పరిషత్ ఎన్నికలకు ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. మొదట బ్యాలెట్‌ బాక్స్‌ల లెక్కింపు జరుగగా... అత్యధికంగా కూటమి పార్టీ అభ్యర్థులే ఆధిక్యంలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7767 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవగా.. రాత్రి 8 గంటలలోపు పూర్తి అయ్యే అవకాశం ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save