Global Vaartha
Date of Publish : 07/11/2026, 12:38 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎల్‌నినో విపత్తుకు ప్రభుత్వమే కారణమనడం దారుణం: విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్ : అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు.‘కరోనా సృష్టికర్త కేసీఆర్ అని మేం అనలేమా?.. ఎబోలా సృష్టికర్త హరీష్ రావు అని అనలేమా?.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ హరీశ్ రావు. ఆయన కళ్ళు ఉండి కూడా.. గుడ్డివాడిలా వ్యవహరిస్తున్నారు. కరెంట్ డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. మేం రైతులకు కరెంట్ ఇస్తున్నాం. మీ హయాంలో కంటే మేమే రైతులను ఎక్కువగా ఆదుకున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు ఊరుకోరు. కాళేశ్వరం కట్టి గోదావరి నీళ్లను తెలంగాణకు ఉపయోగం లేకుండా చేశారు. కృష్ణా నీటిని పక్క రాష్ట్రానికి రాసిచ్చి తెలంగాణకు మరణ శాసనం రాసింది ఎవరు.. కేసీఆర్ కాదా..’ అంటూ విప్ శ్రీనివాస్ నిలదీశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save