Global Vaartha
Date of Publish : 07/11/2026, 12:43 pm
Editor : భవ్య జర్నలిస్ట్

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

మేడ్చల్ : జిల్లాలోని శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాగిశెట్టిపల్లి కోళ్ల ఫారాల సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వ్యర్థాలను తరలించే వాహనం వేగంగా బైక్‌‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి.. శామీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఆ మృతదేహాలను మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save