అమరావతి : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తెస్తాయన్నారు. దీపావళి వెలుగులు చీకటి ఆలోచనలను నాశనం చేసి ఒకరికొకరు సహాయం చేసుకునే శక్తిని ఇస్తాయన్నారు.‘ఈ ఆనందకరమైన దీపావళి పండుగ పర్వదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి, శ్రేయస్సు మరియు ఆనందాన్ని తెస్తాయి. దీపావళి పండుగ చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తుంది. దీపావళి వెలుగులు చీకటి ఆలోచనలను నాశనం చేసి, సమాజంలోని చెడును నిర్మూలిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకునే శక్తిని ఇంకా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలాంటి పండుగలు శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, మత సామరస్యంతో నిండిన సమాజాన్ని నిర్మించడానికి ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటాయి’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.