Global Vaartha
Date of Publish : 07/11/2026, 1:02 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మైదుకూరు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి చాగన బోయిన కిషోర్ ఘన విజయం!

  • 18,903 ఓట్ల భారీ మెజారిటీతో విజయం

మైదుకూరు మండల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాగన బోయిన కిషోర్ విజయం సాధించారు. జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థికి 19,886 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 983 ఓట్లు వచ్చాయి. దీంతో చాగన బోయిన కిషోర్ 18,903 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

మైదుకూరు జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల వివరాలు

* తెలుగుదేశం పార్టీ (టీడీపీ): 19,886

* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ): 983

* నోటా: 181

* చెల్లని ఓట్లు: 138

మొత్తం పోలైన ఓట్లు: 21,188

మెజారిటీ: 18,903 ఓట్లు

మైదుకూరు మండల జడ్పీటీసీగా విజయం సాధించిన చాగన బోయిన కిషోర్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save