Global Vaartha
Date of Publish : 07/11/2026, 1:07 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు

కర్నూలు : నమ్మేవాళ్లు ఉంటే.. మోసం చేసేవాళ్లకు లోటు ఉండదన్నట్లు.. ఓ వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించడానికి స్వామీజీ అవతారమెత్తాడు. చివరికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో దొంగ స్వామికి ఓ కుటుంబం దేహశుద్ధి చేసింది. గొప్ప స్వామీజీనని చెప్పుకుంటూ.. ఎవరికీ అనుమానం రాకుండా పూజల పేర్లతో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆపై ఆ ఇంట్లో చోరీకి పాల్పడతాడు. అయితే.. ఈ సారి మాత్రం దొంగ స్వామి ప్లాన్ రివర్స్ అయింది. ఎప్పటిలాగానే.. పూజ చేయడానికి ఓ ఇంట్లోకి వెళ్లాడు. పూజ పేరుతో డబ్బు, నగదు కొట్టేస్తుండడంతో గమనించిన కుటుంబసభ్యులు.. గట్టిగా కేకలు వేశారు. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి దొంగ స్వామిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save