Global Vaartha
Date of Publish : 09/11/2026, 10:28 am
Editor : భవ్య జర్నలిస్ట్

సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!

అమరావతి : సహకార సంఘాల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీవ్యాప్తంగా సుమారు 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాలని ఆయా జిల్లాల సహకార అధికారులను కూటమి ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు చేపట్టిన చర్యల నివేదికను పది రోజుల్లోగా సమర్పించాలని సీఎం చంద్రబాబు సర్కార్ ఆదేశించింది. 2027 జనవరిలో ఏపీలోని ఉమ్మడి జిల్లాల వారీగా సహకార ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save