Global Vaartha
Date of Publish : 09/11/2026, 10:36 am
Editor : భవ్య జర్నలిస్ట్

కల్తీ ఆహారంపై కేంద్రం కొరడా.. రూ.81.80 కోట్ల ఆహార పదార్థాల సీజ్

ఇంటర్నెట్ డెస్క్: పండగల వేళ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై జాతీయ ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSAI) దేశవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో ఏకంగా రూ.81.80 కోట్ల విలువైన 3,279.57 టన్నుల నిషేధిత, నిబంధనలకు విరుద్ధమైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు దేశవ్యాప్తంగా కొనసాగిన ఈ తనిఖీల్లో 56,431 ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. పాలు, నెయ్యి, పనీర్‌, స్వీట్లతో పాటు పలు ఆహార పదార్థాల్లో నాణ్యతా లోపాలు, నిబంధనల ఉల్లంఘనల్ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన ఆహార వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నారు. 52 సంస్థల లైసెన్సులను రద్దు చేయగా, మరో 1,133 సంస్థల లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ తనిఖీల్లో 314 సంస్థలు మూతపడగా.. ఆయా ఫుడ్ సేఫ్టీ మేనేజర్లకు 10,047 నోటీసులు జారీ చేశారు.

పండగల సమయంలో ఆహార పదార్థాల వినియోగం పెరిగే నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది. ఈ ఏడాది ఆహార వ్యాపార సంస్థలతో పాటు ఈ-కామర్స్‌ సంస్థలపైనా ప్రత్యేక దృష్టి సారించినట్టు స్పష్టం చేసింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save