Global Vaartha
Date of Publish : 09/11/2026, 10:44 am
Editor : భవ్య జర్నలిస్ట్

వైఎస్ఆర్ ఆడిటోరియం, కళాక్షేత్రం పునరుద్ధరణకు కమిషనర్ ఆదేశాలు

కడప నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి. భవాని ప్రసాద్ గారు నేడు ఉదయం నిర్వహించిన మార్నింగ్ విజిట్‌లో భాగంగా నగర పరిధిలోని వైఎస్ఆర్ ఆడిటోరియం మరియు కళాక్షేత్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆడిటోరియం మరియు కళాక్షేత్రం ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి, వాటి పునరుద్ధరణ (Renovation) పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుపరచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save