Global Vaartha
Date of Publish : 09/11/2026, 10:48 am
Editor : భవ్య జర్నలిస్ట్

‘పనులను అడ్డుకుంటే ఊరుకోం’.. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యపై బండి సంజయ్ వార్నింగ్

కరీంనగర్ : జిల్లాలో నాలుగు కోట్లతో చేపట్టే అర్బన్ డెవలప్మెంట్ పనులకు కేంద్రమంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. డంప్ యార్డ్ సమస్యను వివాదం చేయొద్దన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లు.. కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంట్రాక్టర్లను భయపెడితే పనులు కావని కేంద్రమంత్రి అన్నారు. కరీంనగర్ పేరును సర్వ నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. నీచ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. చిల్లర వేషాలు వేస్తే.. ప్రజలు ఊరుకోరని అన్నారు. పనులను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని కేంద్రమంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు.కాంట్రాక్టర్లను భయపెడితే పనులు కావని కేంద్రమంత్రి అన్నారు. కరీంనగర్ పేరును సర్వ నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. నీచ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. చిల్లర వేషాలు వేస్తే.. ప్రజలు ఊరుకోరని అన్నారు. పనులను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని కేంద్రమంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు.కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య ఇప్పటిది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమస్య పరిష్కారానికి కేంద్రం కూడా హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమకు ఎన్నికల వరకే రాజకీయాలని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save