Global Vaartha
Date of Publish : 09/11/2026, 10:49 am
Editor : భవ్య జర్నలిస్ట్

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రూ.9,053 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఈరోజు పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాలుపంచుకోనున్నారు. నేడు రూ.9,053కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు లఘుచర్ల ఇండస్ట్రీయల్ పార్కులో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నాచారం రేడియల్ రోడ్డు సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5గంటలకు హకీంపేట్‌లో భారీ రైతు బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు. ఈ సభ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌‌కు బయలుదేరనున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save