భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉపాలయమైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు (సోమవారం) నుంచి డిసెంబరు 8 వ తేదీ వరకు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.కార్తీక మాసం సందర్భంగా పవిత్ర గోదావరి నది తీరాన ప్రతి సోమవారం నదీహారతులు అర్చకులు నిర్వహించనున్నారు. రేపటి (మంగళవారం) నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ప్రతిరోజు మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను ఆలయ అర్చకులు జరిపించనున్నారు.