Global Vaartha
Date of Publish : 09/11/2026, 11:23 am
Editor : భవ్య జర్నలిస్ట్

మెదక్‌లో చిరుత కలకలం.. రోడ్డు దాటుతుండగా వీడియో తీసిన యువకుడు

మెదక్ : జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ శివారులో చిరుతపులి కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాకుల గుట్ట సమీపంలోని కామారెడ్డి-రామాయంపేట రహదారిపై చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. చిరుతపులి రహదారి దాటుతున్న దృశ్యాలను ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్న సమయంలో చిరుత కనిపించడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save