Global Vaartha
Date of Publish : 09/11/2026, 1:15 pm
Editor : భవ్య జర్నలిస్ట్

జగనన్న నమ్మిన నాయకుడు చెవిరెడ్డి..

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్

జగనన్న ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు చెవిరెడ్డి: సయ్యద్ గౌస్ మోహిద్దీన్

వైసీపీ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జగనన్న పట్ల అచంచలమైన విశ్వాసంతో, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనదైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాలు, సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ, తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తింపు పొందారని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెవిరెడ్డి అందిస్తున్న స్ఫూర్తి అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లోనూ పార్టీ బలోపేతానికి, జగనన్న నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ జన్మదినం సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save