Global Vaartha
Date of Publish : 09/11/2026, 1:04 pm
Editor : భవ్య జర్నలిస్ట్

88 రోజులైనా ముగియని పార్లమెంట్ సమావేశాలు.. 2008 నాటి రికార్డు బద్దలు

ఇంటర్నెట్ డెస్క్: పాc దీంతో ఈ సమావేశాలు ఇప్పటికే 88 రోజులు దాటాయి. 2008లో యూపీఏ హయాంలో నమోదైన 87 రోజుల రికార్డునూ అధిగమించాయి.

తెర వెనుక ప్రభుత్వ వ్యూహం?

ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత అధికారికంగా ప్రొరోగ్‌ చేయకపోవడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత సమావేశాలను ముగించకపోతే.. అవసరమైనప్పుడు కేవలం 2 రోజుల నోటీసుతో తిరిగి సమావేశపరిచే అవకాశముంటుంది. కాగా.. కొత్తగా సమావేశాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 14 రోజుల ముందస్తు నోటీసులు అవసరం. నిరవధిక వాయిదా అనంతరం సభలను ఎంత వ్యవధిలో ప్రొరోగ్‌ చేయాలన్న దానిపై రాజ్యాంగంలో నిర్దిష్ట గడువు లేదని, అందువల్లే ఈ విధానం నిబంధనలకు విరుద్ధం కాదని అధికార పక్షం వాదిస్తోంది.

మళ్లీ తెరపైకి మహిళా రిజర్వేషన్‌?

మహిళా రిజర్వేషన్‌ అమలు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 850 వరకు పెంచే ప్రతిపాదనకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఏప్రిల్‌ 17న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ అమలు, నియోజకవర్గాల పునర్విభజనల సంబంధిత రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం మళ్లీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save