Global Vaartha
Date of Publish : 09/11/2026, 2:14 pm
Editor : భవ్య జర్నలిస్ట్

భాగ్యలక్ష్మి అమ్మవారి వెండి నాణేల కోసం పోటెత్తిన భక్తులు

హైదరాబాద్ : భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం (Charminar Bhagyalakshmi Temple) వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి ప్రజలు తరలివస్తున్నారు. నిన్న (ఆదివారం) చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో 7 గంటలకు ఖజానా పంపిణీని ప్రారంభించారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి వెండి కాయిన్స్ పంపిణీ చేస్తున్నారు.గుల్జారా హౌస్ 500 మీటర్ల వరకు భక్తుల క్యూ లైన్స్ కిక్కిరిశాయి. ఈ క్రమంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అమ్మవారి కాయిన్ లభిస్తే తమకు సకల శుభాలు, సిరిసంపదలూ కలుగుతాయని భక్తులు నమ్మకంగా భావిస్తారు. ఈ నాణేలను సొంతం చేసుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మూడు రోజుల పాటు అమ్మవారి ఖజానాను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు కాయిన్స్ పంపిణీ కొనసాగనుందని ఆలయ కమిటీ పేర్కొంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save