Global Vaartha
Date of Publish : 09/11/2026, 2:53 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

హైదరాబాద్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కోస్గిలో మృతి చెందిన పార్టీ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నాయకుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.బాధిత కుటుంబానికి అండగా నిలవడం కూడా ఇందిరమ్మ రాజ్యంలో నేరమైందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడమే పాలనగా మార్చుకుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇలాంటి కక్షసాధింపు చర్యలకు బీఆర్ఎస్ ఏమాత్రం భయపడదన్నారు. ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save