Date of Publish : 09/11/2026, 3:22 pm
Editor : భవ్య జర్నలిస్ట్
కొండ కోనల్లో హక్కుల వెలుగు
- మహిళా కార్మికుల ఆధ్వర్యంలో సమాచార గైడ్‌గా ఉపయోగపడే క్యాలెండర్ ఆవిష్కరణ
మునగపాక: మండలంలోని తోటాడ కొండ ప్రాంతంలో ఉపాధి హామీ మహిళా కార్మికులకు సమాచార హక్కు చట్టం–2005, వినియోగదారుల హక్కులు తదితర చట్టాలపై సామాజికవేత్త, సమాచార హక్కు ప్రచార కార్యకర్త బొడ్డేడ జగ్గఅప్పారావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు,కార్మికుల
వేతనాలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం పొందే విధానం, వినియోగదారుల హక్కుల గురించి మహిళలకు వివరించారు. ప్రతి పౌరుడికి సమాచారం అడిగే హక్కు ఉందని, తమ సమస్యల పరిష్కారం కోసం చట్టాలను ఆయుధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకుని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం చట్టాలు, హక్కులు, ప్రజలకు ఉపయోగపడే అవసరమైన సమాచారాన్ని అందించే ఒక గైడ్ గా రూపొందించిన క్యాలెండర్‌ను మహిళల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.