Global Vaartha
Date of Publish : 09/11/2026, 3:46 pm
Editor : భవ్య జర్నలిస్ట్

యూపీ ఎన్నికలు.. 209 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది యూపీ ఎన్నికలకు అధికార బీజేపీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దీపావళి ముగిసిన వెంటనే కార్యరంగంలోకి దిగింది. ఇప్పటికే 209 స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తుది అనుమతుల కోసం ఈ జాబితాను కేంద్ర నాయకత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి మూడోసారి అధికార పగ్గాలు చేపట్టే లక్ష్యంగా బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది.దీపావళి ముగిసిన మరుసటి రోజే రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభించింది. మొత్తం 403 స్థానాలకు గాను 209 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు ప్రచారానికి, ప్రజలతో మమేకం అయ్యేందుకు తగినంత సమయం ఉండాలనే లక్ష్యంతో ముందుగా అభ్యర్థుల జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసినట్టు సమాచారం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, తొలి దశలో అభ్యర్థులుగా ఖరారైన వారిని ఏ కేటగిరీగా పార్టీ పరిగణిస్తోందని సమాచారం. సీఎం యోగితో సమాలోచనల అనంతరం వీరి పేర్లు ఖరారయ్యాయి. కేంద్ర నాయకత్వం నుంచి తుది అనుమతులు రాగానే అభ్యర్థులకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈసారి ఎన్నికల్లో పార్టీ నాయకత్వం రాష్ట్రంలోని మహిళా ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్యాకేజీ తెస్తున్నామని సీఎం యోగి ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save