హైదరాబాద్ : రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుతో వర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 12 వ తేదీన విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. వీసీ అల్డాస్ జానయ్య తనను లైంగికంగా వేధించారంటూ మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషన్ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. విచారణకు హాజరుకావాలని వీసీకి నోటీసులు జారీ చేసింది. మహిళా ప్రొఫెసర్ చేసిన ఆరోపణలపై వీసీ వివరణ అనంతరం తదుపరి చర్యలపై మహిళా కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.