Global Vaartha
Date of Publish : 09/11/2026, 4:23 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి.. వ్యాపారి అరెస్ట్

హైదరాబాద్ : నగరంలో కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం పోచారంలోని పాల తయారీ కేంద్రంపై సోమవారం అధికారులతో కలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాల వ్యాపారిని అరెస్ట్ చేశారు. పాల తయారీ కేంద్రంలోని యంత్రాలను సీజ్ చేశారు.

పాల వ్యాపారిని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వినియోగించి.. ఈ కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు తమ విచారణలో పాల వ్యాపారి వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ కల్తీ పాలను హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడని పోలీసులు చెప్పారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save