ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన జరగలేదు
అవినాష్ రెడ్డి ఆరోపణలకు బీటెక్ రవి స్ట్రాంగ్ కౌంటర్!*
అవినాష్ రెడ్డి మీరు చేసిన దాడులు మరిచిపోయారా?
టీడీపీపై నిందలా?
ఇటీవల ప్రతి చిన్న సంఘటనకు ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీపై రిగ్గింగ్, దౌర్జన్యాలు, పోలీసుల వేధింపులంటూ ఆరోపణలు చేయడం అవినాష్ రెడ్డికి అలవాటుగా మారిందని బీటెక్ రవి విమర్శించారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,
లింగాల మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా, స్వేచ్ఛగా పోలింగ్ జరిగిందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన నామినేషన్ సమయంలో తమపై జరిగిన దాడుల కారణంగా కేసులు ఎదుర్కొన్నవారు కూడా ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలని కోరుకున్నారని తెలిపారు.
అయితే పులివెందుల మండలంలోని ఎర్రిపల్లె, వేముల ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, రాళ్ల దాడులు, రాకెట్లు ప్రయోగించడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, విజువల్స్ తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
ఒకవైపు టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు చేస్తూ, మరోవైపు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలను బట్టి ఒకసారి ఒకలా, మరోసారి మరోలా మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.
ఎన్నికలు ముగిశాయి.. ఇకనైనా రాజకీయ ఆరోపణలు, ప్రెస్‌మీట్లకే పరిమితం కాకుండా పులివెందుల అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ప్రజల సమస్యలపై మాట్లాడండి నియోజకవర్గ అభివృద్ధికి మీ వంతు సహకారం అందించండి. ఇదే మీకు మా సూచన అని హితువు
పలికారు.