Global Vaartha
Date of Publish : 06/11/2026, 10:17 am
Editor : భవ్య జర్నలిస్ట్

వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, విజయ్, కేటీఆర్

చెన్నై: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్‌ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్‌ అనిల్‌రెడ్డి, మాలిని దంపతుల కుమార్తె శ్రేయరెడ్డి, అంజన–గోవింద్‌ బిలాని దంపతుల కుమారుడు ఉజ్వల్‌ల వివాహం గురువారం చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో కనుల పండువగా జరిగింది.ఈ వివాహ మహోత్సవానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దంపతులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.మిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్, ప్రముఖ సినీ నటి త్రిష, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ దంపతులు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దంపతులు హాజరై వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఈ వివాహానికి విచ్చేయడంతో లీలా ప్యాలెస్‌ సందడిగా మారింది.కాగా, వైఎస్‌ జగన్‌ చెన్నైకి విచ్చేశారని తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారుఈ వివాహ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి తదితరులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save