Global Vaartha
Date of Publish : 06/11/2026, 10:25 am
Editor : భవ్య జర్నలిస్ట్

సైబరాబాద్‌ కార్పొరేషన్‌కు ఏ ప్లస్‌ రేటింగ్‌

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)కు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ‘ఏ ఫ్లస్‌’ రేటింగ్‌ను ప్రకటించింది. కార్పొరేషన్‌ ఆర్థిక స్థితిగతులు, ఆదాయ సమీకరణ సామర్థ్యం, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళికలకు ఈ రేటింగ్‌ గుర్తింపుగా నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు, 2026-27 తొలి ఆరు నెలల ఆర్థిక గణాంకాలను పరిశీలించిన అనంతరం ఇండియా రేటింగ్స్‌ సంస్థ ఈ రేటింగ్‌ను ప్రకటించింది. ఐదేళ్ల ఆదాయ, మూలధన వ్యయ ప్రణాళికలను ప్రశంసించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save