హైదరాబాద్ సిటీ: సాంకేతిక విద్యకు చిరునామాగా ఉన్న నగరంలోని జేఎన్‌టీయూకు తొలిసారి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రముఖ అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థల విశ్లేషణా సంస్థ క్వాక్వారెల్లీ సైమండ్స్ (క్యూఎస్) తాజాగా ప్రకటించిన ఆసియా ర్యాంకింగ్‌తో జేఎన్‌టీయూ అంతర్జాతీయ విద్యాసంస్థల సరసన చేరింది. ఆసియా దేశాల్లోని 3600కు పైగా విద్యాసంస్థలను విశ్లేషించిన క్యూఎస్ సంస్థ.. జేఎన్‌టీయూకు 1200-1300 బ్యాండ్‌లో ర్యాంకును ప్రకటించింది.జేఎన్‌టీయూకు తొలిసారి క్యూఎస్ ర్యాంకు లభించడంపై వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ టి. కిషన్‌కుమార్ రెడ్డి, రెక్టార్ దామోదరం, రిజిస్ట్రార్ జయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై వీసీ మాట్లాడుతూ క్యూఎస్ ర్యాంకింగ్‌లో తొలిసారి చోటు దక్కడం.. వర్సిటీలోని ఆచార్యులు, విద్యార్థులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని చెప్పారు. అయితే, విశ్వ విద్యాలయం కొంత మేరకు ఫ్యాకల్టీ కొరత, మౌలిక వసతుల లేమి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిఽధులు మంజూరు కాకపోవడం..వంటి అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నదని, భవిష్యత్తులో వాటిన్నింటినీ అధిగమించి మరింత మెరుగైన స్థానానికి చేరేందుకు కృషి చేస్తామని తెలిపారు.