హైదరాబాద్: దంతేరాస్ అంటేనే ఏదో ఒక ఆభరణం ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, భాగ్యనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం దంతేరాస్ వేడుకలకు దుకాణాలు ముస్తాబయ్యాయి. డైమండ్ కంటే ఎక్కువగా గోల్డ్, సిల్వర్ కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతారు. ఎంత బంగారం కొంటే అంతే బరువుగల వెండి ఆభరణాలు ఉచితం, భారీ షాపింగ్‌పై గోల్డ్, సిల్వర్ కాయిన్స్, జీఎ్‌సటీ తామే చెల్లిస్తాం అని ప్రకటనలతో కొనుగోలు దారులు వారి మాటల్లో పడి ఏదో ఒకటి కొనేందుకు రెడీ అవుతున్నారు. పండుగ వేళ శుభప్రదంగా భావించి నగలు కొనుగోలు చేయాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొనుగోలు దారులు చూసుకోవాల్సిన అంశాలు ఇవే..
రెగ్యులర్‌గా బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉంటే 916 హాల్ మార్కుతో ఉండే 22 క్యారెట్లతో కూడిన నగలు కొనుగోలు చేయాలి. హ్యాండ్ మేడ్, మిషన్ మేడ్‌ను బట్టి తరుగు, మజూరీ చార్జీలు ఉంటాయి.
పసిడి నగలతో కూడిన డైమండ్స్ కొంటే ఇందులో 750 స్వచ్ఛత 18 క్యారెట్స్ ఉంటాయి. దీనివల్ల తక్కువ ధరకే ఎక్కువ మిల్లీ గ్రాముల ఆభరణాలు వచ్చే అవకాశం ఉంది.
డైమండ్స్‌లో నాణ్యతను పరిశీలించేందుకు 4సీ పరిశీలించాలి. అంటే కట్, కలర్, క్లారిటీ, క్యారెట్ వివరాలు పరిశీలించాలి. జీఐఏ, ఐజీఐ వంటి గుర్తింపు పొందిన సర్టిఫికెట్ తీసుకోవాలి.
సిల్వర్, గోల్డ్, డైమండ్ ఏదైనా సరే మీరు కొనుగోలు చేసేటప్పుడు ఉన్న ధర.. ఏదేని కారణాల వల్ల బైబ్యాక్, ఎక్స్ఛేంజ్ ఎంత ఇస్తారో తెలుసుకోవడంతో పాటు ఆ వివరాలు బిల్లులో ఉంటే ఇంకా మంచిది.
24 క్యారెట్లకు డబ్బులు చెల్లించండి.. 22 క్యారెట్ల ఆభరణాలు తీసుకెళ్లండి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీటి వల్ల నిజంగా మీకు ఎంత మేర లబ్ధి చేకూరుతుందో లెక్కలు వేసుకున్న తర్వాత కొనుగోలు చేయండి.
మా దగ్గర అతి తక్కువ వీఏ అంటూ గోల్డ్ షాప్స్ నిర్వాహకులు చెబుతున్న దానికి వాస్తవ కోణంలో నగలు కొనేటప్పుడు ఉండేదానికి పొంతన ఉండదు. ఒక్కో గ్రాముకు మేకింగ్ రూ.50-450 వరకు ఛార్జి ఉంటుంది.
మీ తరపున తామే 3శాతం జీఎ్‌సటీ చెల్లిస్తున్నాం అని చెప్తున్నా ఆ మేరకు వీఏ, మేకింగ్ ఛార్జీలో కలిపి కస్టమర్ల మీద బాదేస్తున్నారు. మీరు ఎక్కడ నగలు కొనుగోలు చేసినా బిల్లు తప్పకుండా తీసుకోవాలి.
దంతేరాస్ పర్వదినం వేళ ఆభరణాలు కొనకపోయినా స్కీమ్‌లో జాయిన్ అయితే మంచిదంటూ సేల్స్ పర్సన్స్ మీకు సెంటిమెంట్‌తో రాయిస్తారు. వాటి వల్ల మీరు కొనేటప్పుడు ఎంత వరకు మేకింగ్, వీఏ ఛార్జీలు లేకుండా ఉంటాయో తెలుసుకోండి.