Global Vaartha
Date of Publish : 06/11/2026, 11:25 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీ యూత్ కాంగ్రెస్ జోన్–6 ఇన్‌చార్జ్‌గా మురతోటి విజయ్ కుమార్ నియామకం

  • ఐదు జిల్లాల బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్‌లో సంస్థాగత బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మురతోటి విజయ్ కుమార్‌ను జోన్–6 ఇన్‌చార్జ్‌గా నియమించింది.

ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజ నాయుడు నూనె విడుదల చేసిన నియామక ఉత్తర్వుల్లో భాగంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల బాధ్యతలను విజయ్ కుమార్‌కు అప్పగించారు.

యూత్ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, యువతను పార్టీ వైపు ఆకర్షించడం, యువజన సమస్యలపై పోరాటాలను విస్తృతం చేయడం వంటి బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

జోన్–6 ఇన్‌చార్జ్‌గా నియామకం కావడంతో యూత్ కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు విజయ్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు . తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఐదు జిల్లాల్లో యువజన కాంగ్రెస్ ను బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు .

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save