Global Vaartha
Date of Publish : 06/11/2026, 11:28 am
Editor : భవ్య జర్నలిస్ట్

హైదరాబాద్‌లో కల్తీ పాల తయారీ గుట్టురట్టు.. 100 లీటర్ల సీజ్

హైదరాబాద్ : భాగ్యనగరంలో కల్తీ పాల తయారీ కలకలం రేపుతోంది. కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు పక్కా సమాచారంతో సదరు కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ మహేశ్వరం జోన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్‌పూర్ పాలపొడిని కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇలా తయారు చేసిన కల్తీ పాలను హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు అధికారుల దాడుల్లో బయటపడింది.కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న ఆండే శ్రీశైలంను(43) SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీశైలం.. పోచారం గ్రామంలో నివాసం ఉంటూ పాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో100 లీటర్ల కల్తీ పాలతో పాటు1 లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్‌పూర్ పాలపొడి ప్యాకెట్లు 35(ఒక్కోటి కిలో) అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ పాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారి పట్ల కఠిన చర్యలు తప్పని పోలీసులు హెచ్చరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save