Global Vaartha
Date of Publish : 06/11/2026, 11:37 am
Editor : భవ్య జర్నలిస్ట్

‘కూకట్‌పల్లిలో ఒక్క ఎకరం అమ్మలేదు’.. ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవరం సవాల్

హైదరాబాద్ : కూకట్‌పల్లి భూములకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. ఈరోజు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలో తాము ఒక్క ఎకరం కూడా అమ్మలేదని.. నిరూపిస్తే వాళ్ల ఇంట్లో ఊడిగం చేస్తానంటూ ఏబీఎన్‌ వేదికగా ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హైదరాబాద్ నగరంపై కనీస అవగాహన లేదని విమర్శించారు.మియాపూర్ భూముల కోసం తాము పోరాడితే.. ఆర్డర్ కాపీ రాకముందే భూముల వేలానికి సిద్ధమయ్యారంటూ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డ్ భూములను ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రూ.50 కోట్లు చెరువుల మీద పెట్టి.. వేల కోట్ల విలువగల భూములు అమ్ముతారా అంటూ ఫైర్ అయ్యారు. పేదలకు సంబంధించిన భూములు అమ్ముతున్నారని.. ఈ విషయంలో ఎట్టిపరిస్థితిలో ఊరుకునేది లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యానించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save