Global Vaartha
Date of Publish : 06/11/2026, 11:40 am
Editor : భవ్య జర్నలిస్ట్

నేడు ధన త్రయోదశి

  • లక్ష్మీపూజలు ప్రారంభం

వరంగల్‌ కల్చరల్‌: దేదిప్యమానమైన దివ్వెల కాంతుల దీపావళి పర్వదినం ప్రత్యేక పూజలతో ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు కొనసా గే వేడుకల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం ధన త్రయోదశి వేడుకను నిర్వహిస్తారు. దీనిని ధన్‌ తేరాస్‌ అని కూడా పిలుస్తారు. దీనితో దీపావళి వేడుకలు, పూజలు ప్రారంభమవుతాయి. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు త్రయోదశి తిథి ప్రా రంభమవుతుంది. మరునాడు శనివారం ఉదయం 10.47 గంటలకు ముగుస్తుంది. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని, కుబేరుడిని, ధన్వంతరస్వామిని పూజిస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగో లు చేస్తారు.శుభ ప్రదంగా భావిస్తారు. ధన త్రేయోదశి రోజున దీపావళి వేడుకల్లో భాగంగా వ్యాపారసంస్థల్లో, గృహాల్లో అమ్మవారి చిత్రపటం, విగ్ర హం వద్ద కలశ స్థాపన చేసి లక్ష్మీ పూజను నిర్వహించుకుంటారు. ఇంట్లో ఐశ్వర్యం, సుఖ సంతోషాలు, సంపద కలుగాలని ధన త్రయోదశి రోజున మహాలక్ష్మి దేవిని పూజిస్తారు. ఇదే రోజున కుబేరస్వామిని ధన సంపద, ఆర్థిక అభివృద్ధి కలుగాలని పూజిస్తారు. ధన్వంతరస్వామిని ఆయురారో గ్యం కలుగాలని పూజలు నిర్వహించి నాణెములతో పూజలు నిర్వహించుకుంటారు. దీపావళి వేడుకల్లో భాగంగా మొదటి రోజును జరుపుతారు.

రేపు భోగి..

దీపావళి పర్వదినానికి ముందు రోజును భోగిగా ఆచరిస్తారు. ఇదే రోజున నరక చతుర్థశి అనికూడా పిలుస్తారు. భోగి అనే వేడుక సంక్రాంతి ముందు రోజు వస్తుంది. దీపావళి పండుగ ముందురోజును కూడా భోగిగా పిలుస్తారు. ఈ రోజున పండుగ వేడుకగా ఆచరిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు. ఇదే రోజున శ్రీకృష్ణుడు నరకసురుడిని సంవహరించి న రోజుగా గుర్తించి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుతారు. కంకకర్రలను ఉదయం సూర్యోదయానికి ముందే వెలిగించి చు ట్టూరా తిప్పుకుంటారు. నూతన వస్త్రాలను ధరిస్తారు. దీపావళి మందులు కాలుస్తారు. ఈ ఏడాది అధిక మాసం వచ్చినందున కొత్త అల్లుళ్లకు దీపావళి కట్న కానుకలు వేడుకలు నిర్వహించకూడదని అర్చకులు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save