Global Vaartha
Date of Publish : 06/11/2026, 11:52 am
Editor : భవ్య జర్నలిస్ట్

రంగారెడ్డి జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ కూడలి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అయ్యప్ప అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయ్యప్ప తన ద్విచక్ర వాహనంపై హిమాయత్ సాగర్ నుంచి హైదర్‌గూడ వైపు వెళ్తుండగా రాజేంద్రనగర్ కూడలి వద్ద ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో అయ్యప్ప ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి వేగంగా వెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని తదుపరి ప్రక్రియ నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగింది? ద్విచక్ర వాహనాల వేగమే ప్రమాదానికి కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save