Global Vaartha
Date of Publish : 06/11/2026, 11:58 am
Editor : భవ్య జర్నలిస్ట్

జగన్ ఓటు వేయలేదు.. వైసీపీకి పోటీ చేసే సత్తా లేదు: బీద రవిచంద్ర

నెల్లూరు : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా చెప్పుకునే ప్రతిపక్ష హోదాలేని వైసీపీ అధ్యక్షుడు జగన్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. వైసీపీ నేతలు పోటీచేసే సత్తాలేక, తప్పులతో నామినేషన్లు వేశారని విమర్శించారు. దమ్ము, ధైర్యం లేక పారిపోయి తమపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కూటమి పార్టీలతోనే అభివృద్ధి, సంక్షేమమని ప్రజలు.. స్థానిక సంస్థలు కట్టపెడుతున్నారని తెలిపారు. మున్సిపాల్టీల కంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫలితాలు సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.ఒన్ మినిట్ వీడియోలతో సోషల్ మీడియాలో విషప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణపై లేనిపోని విమర్శలు చేశారని... ఆయా డివిజన్లలో ఎవరు గెలిచారని ప్రశ్నించారు. ‘పెట్రోల్ బాంబులు ఎవరు వేశారు. కత్తులతో తరిమింది ఎవరు’ అంటూ నిలదీశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా కారుతో టీడీపీ కార్యకర్తలని చంపేయబోయారని... ఆ సమయంలో ఎదురు తిరగరా అంటూ నిలదీశారు. వైసీపీ చెప్పే అబద్ధాలను ప్రజలు ఎవరూ నమ్మలేదని.. కూటమి నేతల నాయకత్వాన్ని నమ్మారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save