జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఐదు రెవెన్యూ డివిజన్లలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు ..... జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి
కడప, నవంబర్ 6 : జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఇందులో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఐదు రెవెన్యూ డివిజన్లలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
* బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బి.కోడూరు, మైదుకూరు, శ్రీ అవదూత కాశీ నాయన, బి. మటం, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల మండలాలకు సంబంధించి బద్వేల్‌లోని అంబేద్కర్ గురుకులాన్ని కేంద్రంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మైలవరం, దువ్వూరు, పెద్దముడియం, ప్రొద్దుటూరు మండలాలకు సంబంధించి జమ్మలమడుగులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు సంబంధించి కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం పాలటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* పులివెందుల రెవెన్యూ డివిజన్ పరిధిలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాలకు సంబంధించి పులివెందులలోని రమనప్ప సత్రం, జడ్ .పి హై స్కూల్ లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నందలూరు, రాజంపేట, టి.సుండుపల్లి, వీరబల్లి మండలాలకు సంబంధించి రాజంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కౌంటింగ్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
--------///---------