Global Vaartha
Date of Publish : 06/11/2026, 12:57 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఫీల్డింగ్‌లో టీమిండియా అదుర్స్‌.. కోహ్లీ, రోహిత్‌పై కోచ్‌ ప్రశంసలు!

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత జట్టు ఫీల్డింగ్‌ అద్భుతంగా ఉందని ఫీల్డింగ్‌ కోచ్‌ సుభదీప్‌ ఘోష్‌ ప్రశంసించారు. విరాట్‌ కోహ్లీ క్యాచ్‌, రోహిత్‌ శర్మ రనౌట్‌ జట్టు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కొనియాడారు. ఆక్లాండ్‌లో వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో భారత్‌ డీఎల్ఎస్‌ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 185 పరుగులకే కట్టడి చేయడంలో బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా కీలక పాత్ర పోషించారని ఘోష్‌ తెలిపారు. క్యాచింగ్‌, గ్రౌండ్‌ ఫీల్డింగ్‌, ఆటగాళ్ల చురుకుదనం బాగున్నాయని చెప్పారు.

కోహ్లీకి కవర్‌, పాయింట్‌ స్థానాల్లో ఫీల్డింగ్‌ చేసిన అపార అనుభవం ఉండటంతో బంతి దిశను ముందుగానే అంచనా వేయగలుగుతున్నారని ఫీల్డింగ్‌ కోచ్‌ సుభదీప్‌ ఘోష్‌ వివరించారు. రనౌట్‌ సమయంలో రోహిత్‌ కూడా బంతి వెళ్లే దిశను పసిగట్టి ముందుగానే కదిలాడని ప్రశంసించారు. కోహ్లీ అద్భుతమైన క్యాచ్, రోహిత్ శర్మ కీలక రనౌట్ చేయడంపై ఆయన అభినందించారు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బౌలర్లు, ఫీల్డర్లు సమన్వయంతో రాణించడంతో కివీస్ జట్టు 185 పరుగులకే పరిమితమైంది. ముఖ్యంగా కోహ్లీ పట్టిన అద్భుతమైన క్యాచ్, రోహిత్ శర్మ చేసిన రనౌట్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శనపై సుభదీప్ ఘోష్ మాట్లాడుతూ.. ఫీల్డింగ్‌లో ముందస్తు అంచనా చాలా ముఖ్యమని తెలిపారు.

కోహ్లీ ఎన్నోసార్లు కవర్స్, పాయింట్ స్థానాల్లో ఫీల్డింగ్ చేశాడని ఫీల్డింగ్‌ కోచ్‌ సుభదీప్‌ ఘోష్‌ తెలిపారు. అందువల్ల బంతి ఏ దిశగా వస్తుంది? బ్యాట్‌కు తగిలిన తర్వాత ఎలా ప్రయాణిస్తుంది? అనే విషయాలను కోహ్లీ త్వరగా అంచనా వేయగలడని చెప్పారు. ఆ అవగాహనే మైదానంలో అతడి అద్భుతమైన ప్రదర్శనకు కారణమైందని వివరించారు.

ఇక రోహిత్ శర్మ రనౌట్ గురించి మాట్లాడుతూ.. బంతి స్క్వేర్ లెగ్ వైపు వెళ్తుందని ముందుగానే ఊహించి అటువైపు కదిలాడని వివరించారు. ఈ ముందస్తు అంచనా వల్లే రనౌట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగాడన్నారు. విదేశీ పర్యటనల్లో మైదానాల పరిమాణం, వాతావరణ పరిస్థితులు మారుతుంటాయని, వాటికి అనుగుణంగా ఆటగాళ్లు తమ ఫీల్డింగ్‌ను మార్చుకోవాలని ఘోష్ సూచించారు. సరైన మైండ్‌సెట్‌తో పాటు తొలి అడుగు వేగంగా వేయడం కూడా ఫీల్డింగ్‌లో కీలకమని తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save