Global Vaartha
Date of Publish : 06/11/2026, 2:19 pm
Editor : భవ్య జర్నలిస్ట్

జిల్లా కోర్ట్/ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప న్యాయ విభాగము:

“చాపాడు ఎంపీడీఓ ఆఫీస్ నందు కమ్యూనిటీ మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.”

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా గౌరవ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయధికారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప జి .రామ గోపాల్ వారి సూచనల మేరకు గౌరవ ఎస్.బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప వారు అవగాహన/న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా సెక్రటరీ గారు మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో వారి గ్రామాలలో ఉండే వక్తులను కమ్యూనిటీ మీడియేటర్స్ ను నియమించడము జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య తలెత్తే చిన్న చిన్న వివాదాలు, కుటుంబ సమస్యలు, భూ సంబంధిత వివాదాలు, ఆస్తి తగాదాలు మరియు ఇతర సామాజిక సమస్యలను పరస్పర చర్చలు, అవగాహన, సయోధ్య ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని వివరించడం జరిగింది. కమ్యూనిటీ మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులకు వెళ్లకుండానే స్థానిక స్థాయిలోనే వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని, దీనివల్ల సమయం, డబ్బు ఆదా కావడమే కాకుండా ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, సామాజిక ఐక్యత పెంపొందుతాయని తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ కమ్యూనిటీ మధ్యవర్తిత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. శాశ్వత లోక అదాలత్, జాతీయ లోక్ అదాలత్, ఎల్.యస్.యు.సి, ఎల్.యస్.యు.యం మొదలగు అంశాలను వివరించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించడం జరిగినది. ఏవైనా సమస్యలుంటే మైదుకూరు మండల న్యాయ సేవా సమితిని మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కడప ను సంప్రదించవచ్చును అన్నారు.

శిక్షణ పొందిన కమ్యూనిటీ మధ్యవర్తులు బి. రామ కృష్ణ రెడ్డి ఎం.ఓబులారెడ్డి జి. శేషయ్య లకు సర్టిఫికెట్స్ ను గౌరవ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప శ్రీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ గారు మరియు గౌరవ చైర్మన్ కం జూనియర్ సివిల్ జడ్జి, మైదుకూరు శ్రీ షేక్. బాబాజాన్ వారు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన మధ్యవర్తులు ఎ.సుబ్రహ్మణ్యం శ్రీమతి ఉమాదేవి, చాపాడు మండల్ రెవిన్యూ ఆఫీసర్ శ్రీమతి పి. రామ కుమారి, డిప్యూటీ తహశీల్దార్ ఎన్.ఎల్. వి. కృష్ణ రావు, ఆర్.ఐ పి. శంకర్ రెడ్డి, ఏ. ఎస్. ఐ శ్రీ బాలయ్య, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీమతి చంద్రకాంతమ్మ, పి మనోహర్, గ్రామస్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save