Global Vaartha
Date of Publish : 06/11/2026, 4:13 pm
Editor : భవ్య జర్నలిస్ట్

వేములవాడలో అమానుషం.. బతికుండగానే శ్మశానానికి తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా : మనిషికి కష్టమొస్తే ఆదుకోవాల్సిన సమాజంలో.. కనీసం తలదాచుకునేందుకూ చోటు దొరకని దుస్థితి నెలకొంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని.. బతికుండగానే శ్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ హృదయవిదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది.వేములవాడలోని ఓ అద్దె ఇంట్లో రాకేశ్, అమృత దంపతులు నివాసముంటున్నారు. రాకేశ్‌ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే.. తీవ్ర అస్వస్థతతో ఉన్న రాకేశ్‌ను కిరాయి ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, ఇంటి యజమాని అనుమతించలేదని తెలుస్తోంది. దీంతో అప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇక చేసేదేమీ లేక ప్రాణాలతోనే ఉన్న రాకేశ్‌‌ను వేములవాడ వైకుంఠధామానికి తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి వైద్య సాయం, కనీస ఆశ్రయం అందించాల్సిందిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం స్థానికంగా కలకలం రేపింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save