Global Vaartha
Date of Publish : 06/11/2026, 4:14 pm
Editor : భవ్య జర్నలిస్ట్

హైదరాబాద్‌లో డీటీఎఫ్ దాడులు.. భారీగా డ్రగ్స్ పట్టివేత, ఒకరి అరెస్ట్

హైదరాబాద్ : భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డీటీఎఫ్ టీమ్ దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగరంలోని కుత్బుల్లాపూర్‌లో డ్రగ్స్ విక్రయాలపై డీటీఎఫ్ బృందం దాడులు నిర్వహించింది. కారులో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుంది. నిందితుడిని కుష్ లోయగా గుర్తించారు. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో వివిధ రకాల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీటీఎఫ్ బృందం నిర్వహించిన తనిఖీల్లో నిందితుడి వద్ద 58 గ్రాముల ఓజీ కుష్ లభ్యమైంది. అదేవిధంగా 0.95 గ్రాముల ఎండీఎంఏ, రెండు ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను అధికారులు పట్టుకున్నారు.నిందితుడు డ్రగ్స్‌ విక్రయాలకు ఉపయోగిస్తున్న కారు, సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, కారు, సెల్‌ఫోన్లతో పాటు నిందితుడిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు డీటీఎఫ్ బృందం అప్పగించింది. కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అతడికి ఇంకా ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగనుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save