Global Vaartha
Date of Publish : 06/11/2026, 4:38 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పుష్కరాల పనుల్లో ఆలస్యం వద్దు.. అధికారులకు మంత్రి లక్ష్మణ్ ఆదేశాలు

హైదరాబాద్ : తెలంగాణలో 2027 గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులకు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ఈరోజు  సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నట్లు వెల్లడించారు. పుష్కరాల పనుల్లో జాప్యానికి తావివొద్దని.. నిర్దేశిత గడువులోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు.అలాగే ధర్మపురి, కోటిలింగాల అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష జరిపారు. పనుల నాణ్యతలో రాజీపడొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖల మధ్య సమన్వయంతో పనులను వేగవంతం చేయాలన్నారు. ఘాట్లు, రహదారులు, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. ధర్మపురి అభివృద్ధికి సుమారు రూ.226 కోట్లతో పనుల ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ధర్మపురిలో 470 మీటర్ల మేర కొత్త స్నాన ఘాట్ల అభివృద్ధి ప్రతిపాదన ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save