Global Vaartha
Date of Publish : 06/11/2026, 4:40 pm
Editor : భవ్య జర్నలిస్ట్

బంగ్లాదేశ్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై తరలింపు!

స్పోర్ట్స్ డెస్క్: సిల్హెట్ వేదికగా వెస్టిండీస్‌, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి ఎడమ కాలు మడమ బెణకడంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. కనీసం నడవలేని పరిస్థితిలో మైదానంలో కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై వెలుపలికి తీసుకువెళ్లారు.

వెస్టిండీస్ ఇన్నింగ్స్ 78వ ఓవర్‌లో మెహిదీ హసన్ మిరాజ్ వేసిన బంతిని జస్టిన్ గ్రీవ్స్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. బంతిని ఆపేందుకు వేగంగా పరుగెత్తిన ఇస్లామ్ యాంకిల్ ట్విస్ట్ కావ‌డంతో కింద ప‌డిపోయాడు. వెంటనే స్పందించిన బంగ్లా జట్టు ఫిజియో మైదానంలోనే ప్రథమ చికిత్స అందించారు. అయినప్పటికీ నొప్పి తీవ్రత తగ్గకపోగా.. కాలు కదిలించేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే ఫిజియో సాయంతో అతడినిస్ట్రెచర్‌పై మైదానం బయటకు తరలించారు.

స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇస్లామ్ గాయంపై బంగ్లా క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేయనుంది. మరోవైపు ఇస్లామ్ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేకపోవడంతో, అతడి స్థానంలో నయీమ్ హసన్ ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save