08/11/2026, Sunday · 03:00:06 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha
Global Vaartha

This is Short News — best viewed on mobile.

News ePaper
భవ్య జర్నలిస్ట్
Editor
14 days ago

ప్రభుత్వం కొత్త పథకం... Blood_On_Call💥

ఈరోజు నుండి, భారతదేశంలో రక్త అవసరాలకు "104" ప్రత్యేక నంబర్ కానుంది. "Blood_On_Call" అనేది సేవ పేరు. ఈ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత, 40 కిలోమీటర్ల పరిధిలో, నాలుగు గంటల్లోపు, రక్తం డెలివరీ అవుతుంది... 👍 బాటిల్ కు రూ. 450/- మరియు రవాణాకు రూ.100/-

భవ్య జర్నలిస్ట్
Editor
14 days ago

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు

కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ప్రతిపాదిత సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారంపై చర్చించారు. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక రంగాల విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే అంశాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు

భవ్య జర్నలిస్ట్
Editor
14 days ago

విడదల రజిని ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీవ్రంగా స్పందించింది. ▪️ చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు అన్ని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ▪️ ఎస్సై ప్రియాంకపై విచారణకు ఆదేశించిన SEC.. ఘటనపై నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

భవ్య జర్నలిస్ట్
Editor
14 days ago

ముగిసిన నామినేషన్ల పర్వం

ఎంపీటీసీల్లో టీడీపీ 22,013, వైసీపీ 20,556 ఏపీలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 659 జడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు జడ్పీటీసీల్లో టీడీపీ 2,078, వైసీపీ 1,815, జనసేన 679 శ్రీకాకుళంలో టీడీపీ, వైసీపీ చెరో 1,248; తిరుపతిలో టీడీపీ 1,359, వైసీపీ 1,122

భవ్య జర్నలిస్ట్
Editor
15 days ago

ముంచుకొస్తున్న'అర్ణబ్‌' తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. 26 నాటికి తుపానుగా మారే అవకాశం.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు..కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..నేటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు..

భవ్య జర్నలిస్ట్
Editor
15 days ago

వెంకట శివ నామినేషన్

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతించిన రీ నామినేషన్లలో భాగంగా కడప కలెక్టరేట్ సభా భవన్ లో శుక్రవారం కడప నగరపాలక సంస్థ 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిపిఐ కడప నగర కార్యదర్శి యన్ వెంకట శివ.

భవ్య జర్నలిస్ట్
Editor
15 days ago

నందలూరు అల్లర్లపై కేసులు నమోదు..!

50 మందిపై నందలూరు పీఎస్‌లో కేసులు నమోదు. 8 మందిపై బెయిలబుల్‌ కేసులు నమోదు. గాల్లోకి కాల్పులు జరిపిన డా. బాలసుబ్రమణ్యం, స్థానిక నేత విజయశేఖర్‌పై కేసు నమోదు.

భవ్య జర్నలిస్ట్
Editor
15 days ago

టీడీపీ క్లస్టర్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో.

రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప MLA మాధవిరెడ్డి , జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి ఆదేశాల మేరకు.... కడప.టీడీపీ క్లస్టర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో. పోసా సునీల్ కుమార్ 50వ డివిజన్ పరిధిలోని సాయి పేట లో కడప కూటమి మేయర్ అభ్యర్థి మన ఆడబిడ్డ మట్లి సువర్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 50వ డివిజన్ మహిళలతో, నాయకులతో, ప్రచారం చేయడం జరిగినది.

భవ్య జర్నలిస్ట్
Editor
15 days ago

బీటెక్ రవి వాహనాన్ని తనిఖీ

ఎన్నికల నేపథ్యంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి వాహనాన్ని తనిఖీ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సుధీర్, పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

భవ్య జర్నలిస్ట్
Editor
16 days ago

నైరుతి రెడ్డి హౌస్ అరెస్ట్

గుంతకల్ లో పోలీసులు ఓవర్ యాక్షన్.. జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ని వైయస్ఆర్ సీపీ నాయకులను హౌస్ అరెస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ గడువు ఈరోజుతో ముగుస్తుండగా.. ఆఖరి రోజు కూడా నామినేషన్ వేయనీయకుండా వైయస్ఆర్ సీపీ అభ్యర్థులను అడ్డుకునే కుట్రలు అభ్యర్థులకి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సహా.. ఎవరూ రాకుండా పోలీసుల సాయంతో అడ్డుకోవడానికి హౌస్ అరెస్ట్