అత్తాపూర్లో బైక్ను ఢీకొట్టిన వాహనం.. ఒకరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ : మెహదీపట్నం సమీపంలోని అత్తాపూర్ రోడ్డులో పీవీఎన్ఆర్ పిల్లర్ నంబర్ 99 వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో.. తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతడు అపస్మాకర స్థితిలోకి వెళ్లాడు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. 108తోపాటు పోలీసులకు కాల్ చేశారు.108 వాహనంలో అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను వారు పరిశీలిస్తున్నారు. బాధితుడికి సంబంధించిన వివరాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి :: యూపీలో విషాదం.. ట్రాలీని ట్రక్కు ఢీకొని ఐదుగురు మహిళల మృతి












