08/11/2026, Sunday · 03:08:42 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా స్టీఫెన్‌ మిల్లర్‌.. ట్రంప్ ప్రకటన

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 11:29 AM జాతీయం 7

వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా స్టీఫెన్‌ మిల్లర్‌.. ట్రంప్ ప్రకటన
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఓటమి నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సుసీ వైల్స్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆమె స్థానంలో తనకు అత్యంత నమ్మకస్తుడైన డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ను నియమించారు. ఈనెల 9న మిల్లర్‌ ఆ బాధ్యతలు చేపడతారని ట్రంప్‌ శనివారం తన ట్రూత్‌ సోషల్‌లో వెల్లడించారు. సుసీ వైల్స్‌ తన రాజకీయ కార్యకలాపాల విభాగంలో కొనసాగుతారని తెలిపారు. చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఆమె అందించిన సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

2024 అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్‌ మొదట నియమించిన వ్యక్తి సుసీ వైల్స్‌. వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత పదవీకాలంలో అత్యధిక కాలం ఆ బాధ్యతల్లో కొనసాగిన వ్యక్తిగా నిలిచారు. తన చివరి రోజు ఇదేనని వైల్స్‌ కూడా ప్రకటించారు. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పనిచేయడం తన జీవితంలో గొప్ప గౌరవమని తెలిపారు. అమెరికా సరిహద్దుల భద్రతను బలోపేతం చేయడం, పన్నులు తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం వంటి వాటిలో భాగం కావడం గర్వంగా ఉందన్నారు.

మంత్రివర్గంలోనూ మార్పులు?

మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత ట్రంప్‌ తన మంత్రివర్గంలోనూ భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ను పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. విదేశాంగ మంత్రి మార్కో రూబియో 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యేందుకు తన పదవికి దూరం కావచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి :: 'అక్టోబర్‌ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

Stephen MillerTrumpannouncesWhiteHouseChiefStaff

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు