08/11/2026, Sunday · 03:00:14 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రెండో వన్డేలోనూ భారత బౌలర్ల హవా.. 134 పరుగులకే కివీస్ ఆలౌట్

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 12:22 PM క్రీడలు 6

రెండో వన్డేలోనూ భారత బౌలర్ల హవా.. 134 పరుగులకే కివీస్ ఆలౌట్
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. భారత్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలవడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.ఓ వైపు వికెట్లు పడుతున్నా డారిల్ మిచెల్(55) పోరాడి హాఫ్ సెంచరీ చేశాడు. అతడి నాక్ వల్లే కివీస్ ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. మిచెల్ శాంట్నర్(31), నికోల్స్(11) పరుగులు చేశారు. ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. విల్ యంగ్(6), టిమ్ సీఫర్ట్(0), లాథమ్(7), ఫిలిప్స్(0), స్మిత్(3), జెమీసన్(7), టిక్నర్(2) పరుగులు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 4, అన్షుల్ కాంబోజ్ 2, అక్షర్ పటేల్ 2, ఆకిబ్ నబీ 2 రెండు వికెట్లు పడగొట్టారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

second ODIKiwisout

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు